![]() |
![]() |
.webp)
ఈ నెల 25 న ఫార్మర్స్ డే, క్రిస్మస్ డే సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ దీని మీద షో చేయడానికి రెడీ అయ్యింది. రీసెంట్ గా దీని ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఎప్పటిలాగే కమెడియన్స్ అలరించారు. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" మూవీ థీమ్ ని స్పూఫ్ గా చేసి చూపించారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ మొత్తం కూడా రైతులకు విషెస్ చెప్పారు. అలాగే కొంతమంది రైతుల్ని కూడా ఈ షోకి తీసుకొచ్చారు.
వాళ్ళతో కూడా ఆది, పంచ్ ప్రసాద్ పంచ్ డైలాగ్స్ వేయించారు. "తాత మీరేంచేస్తుంటారో" అని ఆది అడిగేసరికి "మీరేం చేస్తారో మేము అదే చేస్తున్నాం పత్తేపారం" అనడంతో అందరూ నవ్వేశారు. తర్వాత పంచ్ ప్రసాద్ వచ్చి " పంటకు పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి " అని మరో రైతును అడిగాడు "ఏముంది రెండు పంచులు వెయ్యి సచ్చి ఊరుకుంటాయి" అనేసరికి ఇంద్రజ పడీ పడీ నవ్వేసింది.
తర్వాత ఇంద్రజ ఆ రైతులు వేసే పంటల గురించి, తెగుళ్లు పట్టి ఎలా పంట నష్టపోతోంది అనే విషయాల గురించి అడిగి తెలుసుకుంది. "ఉన్నా రెండు ఎకరాలను కళ్ళా జూడలే" అనే ఫోక్ సాంగ్ ని పాడి అలరించారు ఫోక్ సింగర్ రాంబాబు. ఈయన పాడిన జానపదానికి అందరూ ఫిదా ఇపోయారు. "ఈ పాట విని అమెరికా నుంచి ఒకతను వచ్చి ఇతన్ని కలిసి కొంత డబ్బు సాయం చేసి వెళ్ళాడు" అని చెప్పాడు ఆది. అలా ఈ కాన్సెప్ట్స్ మధ్యలో టీం అంతా కూడా క్రిస్మస్ ని పురస్కరించుకుని స్టేజి మీద కేక్ కోసి ఎంటర్టైన్ చేశారు.
![]() |
![]() |